తెలుగు కీబోర్డ్

తెలుగులో కంప్యూటర్లో పని చేయడమంటే అదేదో బ్రహ్మ విద్యనో లేకపోతే కేవలం కొందరు సాంకేతిక విజ్ఞానం కలవారికి మాత్రమే సొంతం అన్నది నిన్నటి మాట.
సురవర తెలుగు కీబోర్డుతో మీరు వేరే ఏ సాఫ్టువేర్లు అవసరం లేకుండానే, చాలా సులువుగా తెలుగులో టైప్ చేయవచ్చు.

సురవర కీబోర్డు ఇప్పుడు రెండు మోడళ్ళలో లభ్యమవుతున్నది.
1. వజ్ర (మల్టీమీడియా కీబోర్డు)   2. విజయ (ప్రామాణిక కీబోర్డు)

 

 

 

ఈ కీబోర్డ్…

 • కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ల పై పని చేస్తుంది
 • విండోస్ 8, విండోస్ 7, విస్టా, ఎక్స్పీ లపై పని చేస్తుంది
 • లినక్స్, మ్యాక్ (≥ 10.7) పై పనిచేస్తుంది
 • ఇంగ్లీషు, తెలుగు రెండూ ఒకే కీబోర్డులో లభ్యం
 • ఇన్స్క్రిప్ట్ నమూనా నిమిషాల్లో నేర్పిస్తుంది
 • వేళ్ళ మీద ఒత్తిడి తగ్గించే టైపింగు విధానం
 • ఉచిత ఆన్‌లైన్ టైపింగు ట్యూటరు లభ్యం
 • 3D డిజైన్ ద్వారా అన్ని తెలుగు అక్షరాలు కళ్ళముందే!
 • యూనీకోడ్ తెలుగును మీ మునివేళ్ళపై ఉంచుతుంది
 • మీ కంప్యూటరుకు తెలుగు రుచి చూపిస్తుంది

ఈ కీబోర్డుతో మీరు…

 • సులభంగా తెలుగులో టైప్ చేయండి
 • తెలుగులో ఈ-మెయిల్స్ పంపండి
 • తెలుగులో చాటింగ్ చేయండి
 • తెలుగులో కథలు, నవలలు రాయండి
 • తెలుగులో డాక్యుమెంట్లు ప్రింట్ చేయండి
 • తెలుగులోనే వెబ్‌సైట్లు, బ్లాగులు, వెబ్‌జైన్‌లు కూడా నడపండి.
 • అన్ని తెలుగు అచ్చులు, హల్లులు, ఒత్తులు, గుణింతాలు మరియు అంకెలు టైపు చేయండి.

ఈ కీబోర్డును ఎలా కొనాలి?

ఈ కీబోర్డును కొనటం చాలా సులభం. కొనే విధానాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

వివరాలకు +91-9440409160 నంబరుకు కాల్ చేసి సంప్రదించవచ్చు.

సాంకేతిక సహాయం:

సాంకేతిక సహాయం కోసం మీరు సురవర కరదీపిక గానీ లేదా సురవర వెబ్‌సైటులోని సహాయ విభాగం గానీ చూడవచ్చు.
ఒకవేళ సహాయ పుటలలో మీకు పరిష్కారం లభించకపోతే, దయచేసి support [at] suravara.com కు ఒక వేగు పంపండి.
ఈ కీబోర్డ్ గురించిన చర్చ, సమస్యా-సమాధానాలను సురవర కీబోర్డ్ గుంపు లో చర్చించండి. గుంపు లంకె ఇక్కడ ఉంది.

కీబోర్డ్ వెల :

వజ్ర కీబోర్డు గరిష్ఠ అమ్మకపు ధర (MRP) 1200/- రూపాయలు మాత్రమే.
ప్రత్యేకమయిన 16.75% తగ్గింపు తరువాత ఇప్పుడు మీరు కేవలం 999/- రూపాయలకే ఈ కీబోర్డును సొంతం చేసుకోవచ్చు.
విజయ కీబోర్డు గరిష్ఠ అమ్మకపు ధర (MRP) 700/- రూపాయలు మాత్రమే.
ప్రత్యేకమయిన 10% తగ్గింపు తరువాత ఇప్పుడు మీరు కేవలం 630/- రూపాయలకే ఈ కీబోర్డును సొంతం చేసుకోవచ్చు.
త్వరపడండి ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!
కొనే వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

5 Responses to తెలుగు కీబోర్డ్

 1. తెలుగు భాషలో సులభంగా టైప్ చెయ్యడం కొరకు మీరు రూపొందించిన కీబోర్డు చాలా
  సులభంగా ఉంది మీ యొక్క కృషికి ధన్యవాదాలు.

 2. సురవర వారికి ధన్యవాదములు.
  తెలుగులో టైపు చెయడానికి అతి సులువైన ఏకైక మార్గం సురవర వారి తెలుగు కీ బోర్డు.
  కీ బోర్డు గూర్చి సరియైన ప్రచారము లేదు.
  అన్ని ప్రచార మధ్యమాల ద్వారా ప్రజలకు సురవర వారి తెలుగు కీ బోర్డు గూర్చి తెలియపర్చగలరు.

 3. నేను హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో మీ స్టాల్లో విజయ కీ బోర్డు కొన్నాను. అందులో
  విసర్గ, ఋ (అరూ) వట్రసుడి దీర్ఘము పని చెయ్యటం లెదు. ఏదైనా సహాయం చెయ్యగలరా ?
  [Admin] Check this. http://kinige.com/telugu_typing_tutor/index.php?book=9&chapter=1&about and other related lessons. If the problem continues please give your system details, like windows/mac/linux. and version. and the application you are trying (notepad/word/)[/Admin]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Comments links could be nofollow free.