సురవర కీబోర్డును విండోస్ XP లో వాడటం

సోపానం 1: ముందుగా క్రింద ఇవ్వబడిన ఏదో ఒక లింకు నుండి icomplex అనే ఉచిత అనువర్తనాన్ని కంప్యూటరులోకి డౌన్లోడు చేసి, ఇన్‌స్టాల్ చేసుకోండి.
http://goo.gl/97201  (లేదా)  

http://www.omicronlab.com/tools/icomplex-full.html
సోపానం 2: icomplex స్థాపించిన తరువాత వ్యవస్థ రీస్టార్టు కోసం అడిగితే రీస్టార్టు చేయండి.
సోపానం 3: తరువాత Start బటన్ నొక్కి Control panel కు వెళ్లండి.


సోపానం 4: ఇప్పుడు Date, Time, Language, and Regional options పై నొక్కండి.


సోపానం 5: తరువాత Add other languages పై క్లిక్ చేయండి.


సోపానం 6: తరువాత Details… బటన్ పై నొక్కండి.


సోపానం 7: ఒక కొత్త విండో ప్రత్యక్షమవుతుంది, ఇందులో Add బటన్ పై నొక్కండి.


సోపానం 8: చివరిగా Input language నందున్న ప్రపంచ భాషల జాబితా నుండి Telugu ఎంచుకుని OK నొక్కి Apply చెయ్యండి.

గమనిక: ఈ విధముగా కంప్యూటరులో టైపింగు కోసం తెలుగు భాషను చేతనం చేసిన తరువాత, మీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో టైపు చేసుకోవచ్చు.

కీబోర్డు నందలి ఎడమవైపున వున్న Alt పట్టుకుని, Shift నొక్కి ఇంగ్లీషు, తెలుగు భాషల మధ్య మారవచ్చు.

మ్యాక్ లయిన్ OS X లో సురవర కీబోర్డు

సోపానం 1: ముందుగా Apple మెనూలోకి వెళ్ళి System Preferences…తెరవండి.


సోపానం 2: తరువాత System Preferences ప్యానల్ నందు మొదటి వరుసలో వున్న Language & Text ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.

సోపానం 3: ఇప్పుడు Input Sources ట్యాబుపై నొక్కి, ప్రపంచ భాషల నుండి Telugu చెక్ బాక్సును ఎంచుకోండి.
తెలుగు భాషలో టైపుచేయుటకు/టైపుచేయు భాషను మార్చుటకు

విధానం 1: వర్డ్ ప్రాసెసర్ వంటి అనువర్తనాన్ని తెరచి, తెర మీద కుడివైపు అగ్ర భాగమున కనిపిస్తున్న అమెరికా జాతీయ జెండా ప్రతీక పై నొక్కి Telugu ఎంచుకోండి.


ఇప్పుడు కీబోర్డు నమూనా తెలుగుకు మారుతుంది, అలాగే జెండా ప్రతీక కూడా భారత జాతీయ పతాకానికి మారుతుంది.

విధానం 2: ప్రతీసారీ కుడి మూలకు వెళ్ళి మౌసుతో జెండా పై నొక్కసాల్సిన అవసరం లేకుండా సులవుగా  కీబోర్డు మీద ఉన్నటువంటి పట్టుకుని space నొక్కి భాషల మధ్య మారవచ్చు, అయితే ఇందుకు కీబోర్డు అడ్డదారులను చేతనించుకోవాలి.
కుడివైపు పైన కనిపిస్తున్న జాతీయ జెండా పై నొక్కి Open Language & Text Preferences…ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.


ఇప్పుడు తెరుచుకున్న విండో ఉన్నటువంటి Keyboard Shortcuts...బటన్ పై నొక్కండి.

తరువాత Keyboard & Text...ఐచ్చికాన్ని ఎంచుకుని, అందులోని చివర ఉన్నటువంటి రెంటు చెక్ బాక్సులను టిక్ చేయండి.

ఒకవేళ టిక్ చేసిన తరువాత పసుపు రంగులో ⚠ హెచ్చరిక చూపిస్తే, ఇదే ఆదేశాలు Spotlight ఐచ్ఛికానికి వినియోగించబడుతున్నాయని గమనించాలి, Spotlight ఐచ్ఛికాన్ని ఎంచుకుని అడ్డదారులను అచేతనం చేయాలి.

సురవర కీబోర్డును లినక్సులో వాడటం

సోపానం1:  ముందుగా మీ ప్రొఫైలుపేరుపై క్లిక్ చేసి System Settings కు వెళ్ళండి.


సోపానం 2: అందులో నుండి Keyboard layout ఎంచుకోండి


సోపానం 3: ఇప్పడు ఒక కొత్త డైలాగు బాక్సు ప్రత్యక్షమవుతుంది, ఇందులో layout ట్యాబును ఎంచుకోవాలి.


సోపానం 4: ఇక్కడ English డీఫాల్టుగా ఉంటుంది, తెలుగును జతచేయడానికి క్రిందన ఉన్నటువంటి + బటన్ పై నొక్కండి.


సోపానం 5: ఇప్పుడు ప్రపంచ భాషలు అన్నీ కనిపిస్తాయి, మౌసును స్క్రాల్ చేసి గానీ లేదా క్రింద ఇవ్వబడినటువంటి సెర్చ్ బాక్సులో Telugu అని టైపు చేసి గానీ తెలుగును ఎంచుకుని Add బటన్ పై నొక్కండి.


సోపానం 6: తరువాత అదే విండోలో ఉన్నటువంటి “Options” బటన్ పై నొక్కితే, కొత్త డైలాగు బాక్సు తెరుచుకుంటుంది.


సోపానం 7: అందులో “Key(s) to change layout” బాణపు గుర్తుపై క్లిక్ చేసి, అందులో ఉన్నటువంటి “Alt+Shift” ఐచ్ఛికముపై గుర్తు పెట్టి చేసి మూసివేయండి.

గమనిక: ఈ విధముగా కంప్యూటరులో టైపింగు కోసం తెలుగు భాషను చేతనం చేసిన తరువాత, మీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో టైపు చేసుకోవచ్చు.

కీబోర్డు నందలి ఎడమవైపున వున్న Alt పట్టుకుని, Shift నొక్కి ఇంగ్లీషు, తెలుగు భాషల మధ్య మారవచ్చు.

సురవర కీబోర్డును విండోస్ 8 లో వాడటం

సోపానం 1: ముందుగా కీబోర్డుపై విండోస్ స్టార్ట్ బటన్ పై నొక్కి Control Panel అని టైపు చేసి Control Panel తెరవండి.


సోపానం 2: ఇప్పుడు Clock, Language and Region వర్గములోని Change input methods/Add a language ఐచ్ఛికముపై నొక్కండి.


సోపానం 3: ఇక్కడ Add a Language బటన్ పై నొక్కి, ప్రపంచ భాషల జాబితా నుండి Telugu భాషను ఎంచుకుని Add బటన్ పై నొక్కండి.

 

తెలుగు భాషలో టైపుచేయడం లేదా టైపుచేయు భాషను మార్చడం ఎలా..?

విధానం 1: వర్డ్ ప్రాసెసర్(MS Word, wordpad, notepad) వంటి అనువర్తనాన్ని తెరచి, టాస్కుబారు పై ఎడమవైపున వున్న ENG పై నొక్కి Telugu   Telugu keyboard ఎంచుకోండి.

ఇప్పుడు కీబోర్డు నమూనా తెలుగుకు మారుతుంది, అలాగే భాష సంకేతం కూడా తె కి మారుతుంది.

విధానం 2: ప్రతీసారీ మౌసుతో ENG పై నొక్కసాల్సిన అవసరం లేకుండా సులవుగా  కీబోర్డు (⌨) మీద ఉన్నటువంటి ఎడమవైపు Alt పట్టుకుని Shift నొక్కి ఆంగ్ల – తెలుగు భాషల మధ్య మారవచ్చు.

ప్రత్యామ్నాయంగా, విండోస్ మీటను పట్టుకుని Space నొక్కి కూడా భాషల మధ్య మారవచ్చు.

సురవర కీబోర్డును విండోస్ 7 లో వాడటం

సోపానం 1: ముందుగా Start బటన్ నొక్కి Control panel కు వెళ్లండి.


సోపానం 2: ఆ తరువాత బొమ్మలో చూపించిన విధముగా Clock, Language, and Region ఐచ్ఛికం క్రిందన ఉన్నటువంటి Change keyboards or other input methods లంకె పై నొక్కండి.


సోపానం 3: ఒక డైలాగు బాక్సు ప్రత్యక్షమవుతుంది, అందులోవున్న “Change Keyboards…” బటన్ పై నొక్కండి.

సోపానం 4: ఇప్పుడు “Add” బటన్ పై నొక్కి, ప్రపంచ భాషల జాబితాలో నుండి (+) Telugu (india)పై డబుల్ క్లిక్ చేసి (గానీ లేదా ప్లస్ (+) చిహ్నం పై నొక్కి గానీ) Keyboard లో ఉన్నటువంటి Telugu చెక్ బాక్సును ఎన్నుకుని OK బటన్ పై నొక్కి Apply చేయండి.

గమనిక: ఈ విధముగా కంప్యూటరులో టైపింగు కోసం తెలుగు భాషను చేతనం చేసిన తరువాత, మీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో టైపు చేసుకోవచ్చు.

కీబోర్డు నందలి ఎడమవైపున వున్న Alt పట్టుకుని, Shift నొక్కి ఇంగ్లీషు, తెలుగు భాషల మధ్య మారవచ్చు.

బ్లాగు పుస్తకం పరిచయ సభ-విజయవాడలో

తెలుగు బ్లాగుల తీరుతెన్నులు, బ్లాగులు ఎలా చదవాలి, ఎలా రాయాలి, తదితర అంశాలతో బ్లాగు పుస్తకం తయారయింది.

ఈ పుస్తకం పరిచయ సభ విజయవాడలో ఏప్రిల్ 8న, 2012 జరుగనుంది.

అందరికీ ఆహ్వానం.

Telugu blog book invitation

ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాగులు ఎలా రాయాలి అనే అంశం పై హ్యాండ్స్‍ఆన్ ఉంటుంది.

బ్లాగు పుస్తకం పరిచయ సభ–ఉపన్యాసాలు ….

(వీడియో చూస్తూ టైప్ చేసినవి… )

చావాకిరణ్ -

అందరికీ మీ యొక్క సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.

బ్లాగు పుస్తక పరిచయ సభ – ఈ రోజు మీకు బ్లాగు పుస్తకం అసలు ఎందుకు తెచ్చాము? ఎవరు తెచ్చారు? వాటి గురించి మాట్లాడతారు. మీకెమన్నా ప్రశ్నలూ, జవాబులూ ఉంటే సుజాత గారు, రహ్మాన్ గారు జవాబులిస్తారు. ముందుగా సుజాత గారు బ్లాగు పుస్తకం వ్రాయడంలో తన అనుభవాలు పంచుకుంటారు.

నమస్తే అండీ, నా పేరు సుజాత. మీలో చాలా మందికి నేను తెలుసు. మనసులో మాట అనే బ్లాగరిగా మీలో చాలా మందికి నేను తెలుసు.

అయితే కిరణ్ గారు ఫస్టు వచ్చి ఇలా బ్లాగు పుస్తకం రాద్దాము అని ప్రతిపాదించినప్పుడు నాకు బోర్ బోర్ అనిపించింది. ఎందుకంటే అప్పటికే నేను బ్లాగు పరిచయాలు ఇలాంటివి వ్రాసి, ఎగ్రిగేటర్స్ గురించి, సంకలిని గురించి ఒక ఆర్టికిల్ రాశాను, మహిళా బ్లాగుల గురించి విడిగా కొన్ని ఆర్టికల్స్ వ్రాసాను. అప్పటికే బ్లాగుల గురించి చాలా వ్రాశాను. అందుకని చెప్పి నేనంత ఆసక్తి చూపించలేదు. కానీ కిరణ్ గారు ఎమన్నారంటే, రాసీ రాసీ ఉన్నానండీ విసుగ్గా ఉంది అంటే – అందుకే మీ దగ్గరకు వచ్చాను అన్నారు. అన్న తరువాత కిరణ్ గారు నాకు చేసిన బిగ్ హెల్ప్ ఏమిటంటే, పెద్ద సాయం ఏమిటంటే నా వెంట పడకుండా నన్ను వదిలేసెయ్యడం. వదిలేసిన తరువాత నేను నెమ్మదిగా ఎట్లా మొదలు పెట్టాలి ఏమిటి అని నేనే ప్లాన్ చేసుకోని నాకు వీలుగా మొదలు పెట్టి కొంత కవర్ చేశాను. చేసిన తరువాత సాంకేతిక విషయలు అన్నీ కూడా వేరే బ్లాగరును చూసి చేద్దాం ఎందుకంటే నేను సాంకేతిక విషయాలు నేను కవర్ చేస్తాము, ముందు థీయరీ పార్ట్ వరకు మీరు వ్రాయమన్నారు. సో వ్రాసానన్న మాట. వ్రాసిన తరువాత అలాగే నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా ఒక రెండు మూడు నెళ్లలో నేను అవగొట్టాను. రెండు నెళ్లు తీసుకున్నాను. ఈ రెండు నెళ్లలో థీయరీ పార్ట్ నేను వ్రాశాను. అట్టాగే మన బ్లాగర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్లల్లో ఎక్కవ యాక్టివ్ గా వ్రాస్తున్నారు? రెగ్యులర్గా ఎవరు వ్రాస్తున్నారు, రేర్గా అరుదుగా వ్రాస్తున్నవారిలో మంచి మంచి టాపిక్స్ ఎంచుకుని ఎవరు వ్రాస్తున్నారు, వాళ్లల్లో కేటగిరైజ్ చేసి, ఇట్లా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, స్టూడెంట్స్, గృహిణులు, కళాకారులు, రచయతలు ఇట్లా కేటగిరైజ్ చేస్తూ, మధ్యలో చర్చించుకుంటా ఎవరెవర్ని వ్రాయొచ్చు, … వ్రాసిన తరువాత దానికి ప్రూఫ్ రీడింగ్ కి మేము ఎక్కువ సమయం తీసుకున్నాం. ఒక రోజు సిక్స్ ఓ క్లాక్ కు కూర్చుని రాత్రి పన్నెండున్నర వరకు చేశామన్నమాట. కొన్ని కొన్ని మరీ కొత్త తెలుగు పదాలు తీసేసి సులభంగా జనాలకు అర్థమవుతాయి అనుకున్న పదాలు ఉంచాము. కొన్ని చోట్లు ఇంగ్లీషు పదాలు వాడిన చోట వీటికి తెలుగు సమానార్థకాలు ఉన్నాయి, తెలుగులో రాస్తే ఓకే, ఇంగ్లీషు రాయక్కర్లేదు అనుకున్న చోట వాటిని ఇంగ్లీషు పదాలు తీసి తెలుగు పదాలు ఉంచాము. దీని కోసం మేము ఎక్కువ సమయం తీసుకున్నాము. బుక్ వచ్చిన తరువాత చాలా బాగా అనిపించింది. మంచి పనే చేశాము అనిపించింది. అవీ నా అనుభవాలు. కొత్త అనుభవాలు ఏమీ లేవు. రహ్మన్ ఏమన్నా ఉంటే చెపుతాడు.

-=================

పుస్తకాన్ని గిఫ్ట్ రేపర్ నుండి విప్పు కార్యక్రమం.

అనిల్, వీవెన్, కట్టా విజయ్, చావా కిరణ్, సుజాత, సంకీర్తన, రహ్మాన్, కందుకూరి రాము, వరూధిని, అశ్విన్ బూదరాజు.

ఓకే ట్విస్ట్ ఏమిటంటే ఎవరు ఓపెన్ చేసిన బుక్ వారికే – చావా కిరణ్

ఇది బ్లాగు పుస్తకం కవర్ పేజీ, దీన్ని డిజైన్ చేసింది రహ్మానే. లోపల ఎక్కడా వ్రాయలేదు, మర్చిపొయినాను, అందుకే సభా ముఖంగా ఇప్పుడు చెపుతున్నాను. రంగులు మాత్రం వీవెన్ గారు చెప్పిన తరువాత మార్చాము.

అనిల్ కినిగెలో బ్లాగు పుస్తకం ఈ-పుస్తకంగా చూపారు.

ఇప్పుడు రహ్మాన్ గారు బ్లాగు పుస్తకం రాయడంలో తన అనుభవాలు, కష్టాలు, నష్టాలు అన్నీ మనతో పంచుకుంటారు.

సో బ్లాగు బుక్ రాయటం మొదలు పెట్టినప్పటి నుండీ, ఆల్మెస్ట్ ముప్పై అప్డేట్లు జరిగాయి. ప్రతిసారీ ఏదో ఒకటి రాయటం, ఫస్ట్ యాక్చువల్గా బ్లాగరుతో మొదలు పెట్టాము. బ్లాగరు ఇంటర్ఫేస్ చేంజ్ అయింది. తెలుగులో దాని ఇంటర్ఫేస్ కూడా సరిగ్గా లేదు. యూజర్స్ ఎడిట్స్, యూజర్ అకౌంట్ ఎడిట్స్ చాలా మార్పులు వచ్చాయి, దాని వల్ల వర్డ్ ప్రెస్ కి మారాము. యాక్చువల్గా రెండూ పెడదామనుకున్నాము, కానీ ఫైనల్లీ వర్డ్ ప్రెస్ తీసుకున్నాము. ఎలా ఉంటుంది, బ్లాగు ఎలా క్రియేట్ చెయ్యాలి కంప్లీట్ వర్డ్ ప్రెస్ తీసుకున్నాము. స్క్రీన్ షాట్స్ కూడా మళ్లీ మళ్లీ మారుతూ వచ్చాయి. పేషంటుగా నేను వ్రాసిన ప్రతీదాన్నీ ఇద్దరూ రివ్యూ చేశారు. వెరీ థాంక్ ఫుల్ టూ దెం.

వీవెన్ – బ్లాగులు ప్రత్యామ్నాయ మాధ్యమంగా

బ్లాగులు ప్రత్యామ్నాయ మాధ్యమం

తెలుక్కి సంబంధించినంత వరకు మనం ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. మనం వ్రాస్తున్నవి అన్నీ కూడా వ్యక్తిగత అనుభవాలూ, లేకపోతే, సినిమాలు లేకపోతే పుస్తకాలు ఇవీ, కొన్ని వ్యక్తిగత అనుభవాలు అంతేగాని, ఎక్కడా మనం శ్రద్దగా సమాజంలో మార్పు తీసుకురావాలి .. ఒకటి రెండు ఉన్నా ఆ వేలో ఎత్తి చూపే విధంగానో లేకపోతే అప్పటి పరిస్థితికి తగ్గట్టు ఏదో ఆవేశం వెళ్లగక్కడం ఇంతే తప్పితే నిర్మాణాత్మకంగా, దీర్ఘకాలంగా ఒక సమస్య తీసుకుని దానిమీద ఒక నిరంతర పోరాటం గాని ఇలాంటి బ్లాగులు మనకింకా ఎదురవ్వలేదు. మనం ప్రత్యామ్నాయ మాధ్యమంగా ఎదగాలంటే అది దృష్టి సారించాల్సిన అంశం. తరువాత రెండు వార్తా పత్రికలకి కాని, టీవీచానల్స్ కానీ, వీటికి వాళ్లకున్న పరిమితులు చాలా ఉన్నాయి. పేపర్ అయితే వాళ్లు కొన్ని పేజీలకంటే ఎక్కువ వేయలేరు. టీవీ అంటే 24 గంటలకంటే ఎక్కువ లేవు, దానిలోనే ప్రకటనలూ వెయ్యాలి. కానీ ఈ మధ్యనే తెలిసిన పరిమితి ఏమిటంటే వాళ్లకు సిబ్బంది పరిమితి కూడా ఉంది. అన్ని అంశాలను కవర్ చెయ్యడానికి. వార్తా పత్రికలుకు వచ్చే సరికి ఒక్కొక్క ఏరియాకు వాళ్లకు ఒక కరస్పాండెంటునో ఎవరినో ఇస్తారు. ఉదాహరణకు ఈ రోజు ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమం గురించి రేప్పొద్దున పేపర్లో రావాలంటే వాళ్ల ప్రతినిధి ఎవరో ఇక్కడికి రావాలి. కానీ ఇదే ఏరియాలో మరో పెద్ద కార్యక్రమం జారుతుంటే దీని మొహమే చూడరు. వాళ్లకు సిబ్బంది పరిమితి కూడా ఉంది. దాన్ని బ్లాగుల ద్వారా మనం పూడ్చుకోవచ్చు. లిటరల్లీ ప్రతి ఒక్కళ్లూ ఒక బ్లాగు రాసుకోవచ్చు. ఆ విదంగా ఎంత చిన్న ఇంపార్టెన్స్ లేని విషయం కూడా బ్లాగులో రాయవచ్చు. అది లక్ష మందికి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, పదివేల మందికి తెలియాల్సిన విషయం కాకపోవచ్చు, కానీ వంద మందికి అది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి చిన్న విషయాలకు, పాజనేట్ విషయాలకు మనం బ్లాగులు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి, అది బ్లాగుల సంఖ్య పెరిగే కొద్ది ఎలాగూ జరుగుతుంది అని నేను ఆశిస్తాను. అంతే.

Next I need a volunteer who can read Telugu. Chavakiran

Aparna Read a topic about బ్లాగు స్నేహాలు from blog book.

వచ్చిన వాళ్లు ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు.

మాట్లాడిని వారికి ఒక బుక్ ఫ్లీ.

బ్లాగింగ్ మీ జీవితాన్ని ఎలా మార్చేసింది? – వేణు గారు మాట్లాడారు.

బ్లాగింగ్ సరదాగానే మొదలయింది. తరువాత అది సీరియస్ గా చేద్దామనే ఉద్దేశ్యంతోనే అప్పుడప్పుడూ ఏదిపడితే అది వ్రాయకుండా కొంచెం ఆచితూచి రాయడం మొదలు పెట్టాను. రాసేది తక్కువయినా అది చూసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంటుంది. వాటిమీద ఎప్పటికప్పుడు తక్షణ స్పందనలు రావడం దీనిలో ఎడ్వాంటేజ్. మనం రాస్తున్నది మిగిల్న వాళ్లు చదువుతున్నారు, దానికి రియాక్ట్ అవుతున్నారు అని తెలుసుకోవడం అది కూడా చాలా సంతోషంగా ఉంటుంది.

I need one more volunteer who can read Technical Telugu.

Kasyap is reading “how to create a blog” chapter from బ్లాగు పుస్తకం.

Somasankar is reading about సంకలినులు.

భాగ్యలక్ష్మి మంచి పుస్తకం ప్రచురణలు – యూజబిలిటీ స్టడీలో తన అనుభవాలు.

…. అప్పుడు నేను అసలు పట్టించుకోలేదు. నాకు అసలు అవసరం లేదు, నాకు అసలు సంబంధం లేని విషయం అనుకున్నాను. కిరణ్, రహ్మాన్ నా ఆఫీసుకు వచ్చారు. వాళ్లు వచ్చినప్పుడు ఈమెయిల్ లేకుండా ఏమి చెయ్యాలి అని తెలీలేదు. అప్పుడు వాళ్లకు అర్థం అయింది అన్న మాట, నాలాంటి వాళ్ల కోసం తీసుకురావాలంటే ఏమి చెయ్యాలో వాళ్లకు అర్థం అయి ఉంటుంది. వాళ్లకు పనికొచ్చే ఉంటుంది.

బ్లాగు పుస్తకం పరిచయ సభ-హైదరాబాద్‍లో

తెలుగు బ్లాగుల తీరుతెన్నులు, బ్లాగులు ఎలా చదవాలి, ఎలా రాయాలి, తదితర అంశాలతో బ్లాగు పుస్తకం తయారయింది.

ఈ పుస్తకం పరిచయ సభ హైదరాబాద్‍లో 19th ఫిబ్రవరి, 2011 న జరుగనుంది.

అందరికీ ఆహ్వానం.

ఎలా చేరుకోవాలి:

ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాగులు ఎలా రాయాలి అనే అంశం పై హ్యాండ్స్‍ఆన్ ఉంటుంది.

బ్లాగు పుస్తకం

బ్లాగు అనేది నేడు అంతర్జాలం అందుబాటులో ఉన్న వారందరికీ ఒక నిత్యావసరంగా మారిపోయింది.

తెలుగులో బ్లాగు అనేది ఎలా ఉంటుందో, ఎలా మొదలెట్టాలో, ఏం రాయాలో విశదీకరించే అద్భుతమయిన పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము.

మీరు ఈ పుస్తకం చదివితే, మీకు…

  • బ్లాగులంటే ఏంటో తెలుస్తుంది
  • బ్లాగులు ఎలా చదవాలో తెలుస్తుంది
  • బ్లాగులు ఎలా రాయాలో తెలుస్తుంది
  • బ్లాగులపై అవగాహన కలుగుతుంది

 

పుస్తక రచయితల గురించి :

ఈ పుస్తక రచయితలు వైవిధ్యమయిన వృత్తుల్లో పని చేస్తూ అర్ద దశాబ్దం పైగా బ్లాగులు వ్రాస్తున్న వారు.

సుజాత:

వీరు పాత్రికేయ రంగంలో ఉన్నారు. ఒకప్పుడు వార్త సంస్థలో పూర్తి స్థాయి పత్రికా వార్తాహరులుగా ఉన్న వీరు ప్రస్తుతం స్వచ్ఛంద పాత్రికేయులుగా పని చేస్తున్నారు. వివిధ  పత్రికల్లో కుటుంబ వ్యవస్థ సంబంధిత వ్యాసాలు రాస్తున్నారు . బ్లాగ్లోకంలో వీరు అందరికీ సుపరిచితులు  మనసులో మాట బ్లాగు ద్వారా వీరు బ్లాగుతూ ఉంటారు. అలానే వారి ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలను నర్సారావు పేట్రియాట్స్ అనే బ్లాగు ద్వారా అందరితో పంచుకుంటూ ఉంటారు.

 

రహ్మానుద్దీన్ :

వీరు  సత్యాన్వేషణ బ్లాగు ద్వారా బ్లాగు ప్రపంచంలో సుపరిచితులు. అలానే లినక్స్ సంబంధిత సాంకేతికాలపై లినక్సుడు అనే బ్లాగు ద్వారా అనేక సాంకేతిక అంశాలు రాస్తూ ఉంటారు. ప్రస్తుతం కినిగె సంస్థలో సాఫ్ట్‍వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.

ఈ పుస్తకాన్ని ఎలా కొనాలి?

పుస్తకాన్ని కొనే విధానాలకి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

పుస్తకం వెల :

పూర్తి రంగుల ఈ పుస్తకం గరిష్ఠ అమ్మకపు ధర (MRP) 230/- రూపాయలు మాత్రమే.
ప్రత్యేకమయిన 26% తగ్గింపు తరువాత ఇప్పుడు మీరు కేవలం 170/- రూపాయలకే ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోవచ్చు.
త్వరపడండి ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!
కొనే వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సాంకేతిక సహాయం:

సాంకేతిక సహాయం కొరకు support [at] suravara.com కు వేగు వెయ్యండి.

ఈ పుస్తకంలోని విషయాలపై చర్చలు, సందేహ-సమాధానాల కోసం బ్లాగు పుస్తకం గుంపులో చేరండి.

సురవర కీబోర్డు మరియు బ్లాగు పుస్తకాన్ని కొనే విధానం

సురవర కీబోర్డు మరియు బ్లాగు పుస్తకాన్ని కొనే విధానం

 

కీబోర్డు ధర 999/- రూపాయలు(తగ్గింపు తరువాత) మాత్రమే.
బ్లాగు పుస్తకం ధర 170/- రూపాయలు(తగ్గింపు తరువాత) మాత్రమే.

ఎలా కొనాలి?

ఆన్లైన్లో కొనటం ఎలా?

ఆన్లైన్లో కినిగె.కాం నుండి కీబోర్డ్ కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి
అలానే బ్లాగు పుస్తకం కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఎం.ఓ., డీడీ మరియు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కొనుగోలు

ఎంఓ, డీడీ, నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయటం లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా మీరు కీబోర్డు మరియు బ్లాగు పుస్తకాన్ని కొనుగోలు చెయ్యవచ్చు.

మని ఆర్డర్(MO ఎంఓ)

ఎంఓ చెయ్యాలనుకునే వారు ఈ కింది చిరునామాకు ఎంఓ చెయ్యండి. ఎంఓ ఫారం లో విధిగా మీ పూర్తి చిరునామా స్పష్టంగా మీ ఫోన్ నంబర్ తో సహా రాసి పంపండి. మీ ఎంఓ రిఫరెన్స్ సంఖ్యను, మీ చిరునామా, తదితర వివరాలతో support@suravara.com కు మెయిల్ చెయ్యండి. మరింత మెరుగయిన సేవల కోసం మా ఫోన్ నంబర్ 09704605854 (లేదా 09440409160) కు ఎసెంఎస్ కూడా పంపగలరు.
ఎంఓ పంపాల్సిన చిరునామా:
Sridevi.S
Flat No.103, Aditya Eternia,
B.P.Raju Marg, Kothaguda,
Kondapur
Hyderabad-500084
Phone : 09704605854 (లేదా 09440409160)

డీడీ

డీడీ పంపే వారు Sridevi.S పేర హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ పంపగలరు. మీ డీడీ సంఖ్యను, మీ చిరునామా తదితర వివరాలతో support@suravara.com కు మెయిల్ చెయ్యండి. మరింత మెరుగయిన సేవల కోసం మా ఫోన్ నంబర్ 09704605854 (లేదా 09440409160) కు ఎసెంఎస్ కూడా పంపగలరు.
డీడీ పంపాల్సిన చిరునామా:
Sridevi.S
Flat No.103, Aditya Eternia,
B.P.Raju Marg, Kothaguda,
Kondapur
Hyderabad-500084
Phone : 09704605854 (లేదా 09440409160)

ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేదా నేరుగా బ్యాంకులో డబ్బు జమ చేయడం

మా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసి కీబోర్డ్ ను పొందదలుచుకునే వారు ఈ కింద ఇవ్వబడిన ఖాతాకు ఆన్లైన్ ద్వారా కానీ, నేరుగా బ్యాంకులో డబ్బు జమ చేసి గానీ బ్లాగు పుస్తకం లేదా కీబోర్డును పొందవచ్చు.
ఖాతా వివరాలు :
Account Number : 007501531104
SRIDEVI SANKRANTHI
ICICI
S.R.NAGAR,HYDERABAD
IFSC = ICIC0000075
MICR = 500229006
బ్యాంకులో డబ్బు జమ చేసాక వచ్చే ట్రాన్సాక్షన్ ఐడీ ని, మీ చిరునామా, ఫోన్ నంబర్ వివరాలతో జతచేసి support@suravara.com కు మెయిల్ పంపండి. మరింత మెరుగయిన సేవల కోసం మా ఫోన్ నంబర్ 09704605854 (లేదా 09440409160) కు ఎసెంఎస్ కూడా పంపగలరు.

మీ చెల్లింపులు అందిన మరుక్షణం మీకు మేము బ్లాగు పుస్తకం మరియు కీబోర్డును కొరియర్ ద్వారా 3 నుండి 7 రోజుల్లో అందేలా పంపిస్తాము.