సోపానం 1: ముందుగా కీబోర్డుపై విండోస్ స్టార్ట్ బటన్ పై నొక్కి Control Panel అని టైపు చేసి Control Panel తెరవండి.
సోపానం 2: ఇప్పుడు Clock, Language and Region వర్గములోని Change input methods/Add a language ఐచ్ఛికముపై నొక్కండి.
సోపానం 3: ఇక్కడ Add a Language బటన్ పై నొక్కి, ప్రపంచ భాషల జాబితా నుండి Telugu భాషను ఎంచుకుని Add బటన్ పై నొక్కండి.
తెలుగు భాషలో టైపుచేయడం లేదా టైపుచేయు భాషను మార్చడం ఎలా..?
విధానం 1: వర్డ్ ప్రాసెసర్(MS Word, wordpad, notepad) వంటి అనువర్తనాన్ని తెరచి, టాస్కుబారు పై ఎడమవైపున వున్న ENG పై నొక్కి Telugu Telugu keyboard ఎంచుకోండి.
ఇప్పుడు కీబోర్డు నమూనా తెలుగుకు మారుతుంది, అలాగే భాష సంకేతం కూడా తె కి మారుతుంది.
విధానం 2: ప్రతీసారీ మౌసుతో ENG పై నొక్కసాల్సిన అవసరం లేకుండా సులవుగా కీబోర్డు (⌨) మీద ఉన్నటువంటి ఎడమవైపు Alt పట్టుకుని Shift నొక్కి ఆంగ్ల – తెలుగు భాషల మధ్య మారవచ్చు.
ప్రత్యామ్నాయంగా, విండోస్ మీటను పట్టుకుని Space నొక్కి కూడా భాషల మధ్య మారవచ్చు.